Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వేలంలో ప్రధాని మోదీ జ్ఞాపికలు.. జాబితాలో ఏపీకి చెందిన 18 బహుమతులు

PM Modi mementos auction includes 18 special gifts from Andhra Pradesh
Advertisement
  • వేలం ద్వారా వచ్చిన నిధులను 'నమామి గంగే' కార్యక్రమానికి వినియోగం
  • వేలం జాబితాలో కొండపల్లి బొమ్మ, కలంకారీ వస్త్రం వంటివి 
  • అందుబాటులో కాకతీయ కళాతోరణం వంటి ఖరీదైన జ్ఞాపికలు 
  • అక్టోబరు 31 వరకు ఆన్‌లైన్‌లో బిడ్లు దాఖలు చేసే అవకాశం
Advertisement
ప్రధాని నరేంద్ర మోదీ వివిధ పర్యటనల సందర్భంగా అందుకున్న బహుమతులు, జ్ఞాపికలను కేంద్ర ప్రభుత్వం మరోసారి వేలానికి ఉంచింది. ఈసారి వేలంలో ఏపీకి చెందిన 18 ప్రత్యేక బహుమతులు కూడా ఉండటం విశేషం. ఈ వేలం ద్వారా సమీకరించిన నిధులను గంగానది ప్రక్షాళన కోసం చేపట్టిన ప్రతిష్ఠాత్మక 'నమామి గంగే' కార్యక్రమానికి విరాళంగా ఇవ్వనున్నారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ ఈ-వేలం ప్రక్రియను నిర్వహిస్తోంది.

ప్రధాని మోదీ తన ఏపీ పర్యటనల సమయంలో పలువురు ప్రముఖులు, సంస్థల నుంచి ఎన్నో కానుకలు స్వీకరించారు. వాటిలో 18 బహుమతులను ప్రస్తుతం వేలంలో ఉంచారు. వీటిలో ప్రధాని ఫొటోతో రూపొందించిన ప్రత్యేకమైన కలంకారీ వస్త్రం, శ్రీశైలంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రం అందించిన జ్ఞాపిక, గ్రామీణ జీవనశైలిని ప్రతిబింబించే కళాఖండం, తెలుగు సంస్కృతికి ప్రతీకగా నిలిచే కొండపల్లి ఎద్దులబండి బొమ్మ వంటివి ఉన్నాయి. ఈ బహుమతులను దక్కించుకోవాలనుకునే వారు ఆన్‌లైన్‌లో బిడ్లు దాఖలు చేయవచ్చు.

ఇది పీఎం మెమెంటోస్ 8వ విడత వేలం కాగా, ప్రజల నుంచి వస్తున్న స్పందన దృష్ట్యా గడువును అక్టోబరు 31 వరకు పొడిగించారు. ఈ వేలంలో దేశవిదేశాల నుంచి అందిన సుమారు 30 రకాల జ్ఞాపికలు ఉన్నాయి. వీటిలో కొన్నింటికి భారీ ధర పలుకుతోంది. తెలంగాణకు చెందిన కాకతీయ కళాతోరణం వెండి నమూనా ప్రాథమిక ధరను రూ.10 లక్షలుగా నిర్ణయించారు. 

అలాగే, జగన్నాథ పరివార రథం ప్రతిమ బేస్ ప్రైస్ రూ.21 లక్షలు కాగా, కర్ణాటకకు చెందిన శ్రీరాముడి వెండి విగ్రహానికి రూ.13.50 లక్షల ప్రాథమిక ధర ఉంది. వీటితో పాటు వివిధ ఆలయాలు, చారిత్రక ప్రదేశాల నమూనాలు, సంప్రదాయ చేతివృత్తుల కళారూపాలు, చిత్రాలు, పెయింటింగులు, విగ్రహాలు, శాలువాలు వంటి ఎన్నో అమూల్యమైన వస్తువులు ఈ వేలంలో అందుబాటులో ఉన్నాయి. 

ఆసక్తి ఉన్నవారు ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ pmmementos.gov.in ద్వారా తమకు నచ్చిన వస్తువుపై బిడ్ వేసి దక్కించుకోవచ్చని సాంస్కృతిక శాఖ అధికారులు తెలిపారు.
Advertisement
Advertisement
PM Modi
PM Mementos Auction
Namami Gange Fund
Andhra Pradesh Gifts
Ministry of Culture
PM Modi Gifts E Auction

More Telugu News